ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తిని హత్య చేసిన మావోయిస్టులు - naxals
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు దాడులు మెుదలయ్యాయి. మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కుకుర్‌కొండి గ్రామానికి చెందిన గుజా కవాసిని ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు దాడులు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి కుకుర్‌కొండి గ్రామానికి మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించారు. గుజా కవాసి, ముసాసోడీ, ఉంగాకల్‌మడి అనే వ్యక్తులను అపహరించారు. అనంతరం తులసీ పహాడ్ వద్ద ప్రజా కోర్టు నిర్వహించి గుజా కవాసిని హత్య చేశారు. మిగిలిన ఇద్దరికి చితకబాది విడిచిపెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవలే పెదబయలు మండలంలో ఒక గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. తాజా ఘటనతో ఏవోబీలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.