కృష్ణా జిల్లా విజయవాడలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై భీభత్సం సృష్టించింది. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా..తీవ్రగాయాలైన ముగ్గురు సెంటిని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.
గాల్లో పల్టీలు- ఒకరు మృతి - ఆంధ్రా న్యూస్
గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు సినీ ఫక్కీలో ఫల్టీ కొట్టి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు గాల్లోంచే ఎగిరిపడ్డారు.
అతివేగం...తీసింది ప్రాణం
విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం
సిని ఫక్కీలో కారు పల్టీలు కొడుతూ మొదట పక్కనున్న ఫెన్సింగ్‌ను ఢీకొని అంతే వేగంగా ఆగి ఉన్న లారీపైకి దూసుకెళ్లింది. కారులో ఉన్న నాగార్జున, హరీష్, ప్రియాంక, మరో యువకుడు గాల్లోంచే చెల్లచెదురుగా ఎగిరి పడ్డారు. నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం విన్న స్థానికులు పోలీసుకు సమాచారం అందించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 21, 2019, 4:12 PM IST