ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మాతృదినోత్సవం నాడు అమ్మతో సరదాగా - AMMA PREMA

అమ్మ ప్రేమలోని ఆప్యాయత ఇంకెక్కడా దొరకదు. ఎన్ని కోట్లు సంపాదించినా తల్లి ప్రేమను కొనలేము. అమృతం లాంటి అమ్మప్రేమను మరిచిపోకండి. రోజూ ఎంత బిజీగా ఉన్న ఓ ఐదు నిమిషాలు అమ్మతో గడపండి. మాతృదినోత్సవాన్ని సామాజిక మాధ్యమాల్లో కాకుండా తల్లితో కలిసి జరుపుకోండి.

మాతృదినోత్సవం నాడు అమ్మతో సరదాగా

By

Published : May 12, 2019, 10:56 AM IST

మాతృదినోత్సవం నాడు అమ్మతో సరదాగా

ఒక్కో దేశంలో ఒక్కో రోజున మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. అమెరికాలో ఫిబ్రవరి రెండో ఆదివారం, దక్షిణాఫ్రికాలో మే నెల మొదటి ఆదివారం చేసుకుంటారు. జపాన్‌తో పాటు మన దేశంలోనూ ఈనెల రెండో ఆదివారం అమ్మకు అంకితం.

మరి ఆ అమ్మ గురించి నేటి తరం ఆలోచిస్తోందా... అనుక్షణం పిల్లల బాగు గురించి పరితపించే అమ్మని రోజులో ఒక్కసారైనా పలకరించరు. కనీసం తిన్నావా.. ఉన్నావా అని కూడా అడగరు. అలాంటి పిల్లలు మాతృదినోత్సవం రోజు మాత్రం అమ్మతో ఫొటోలు దిగడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం. అమ్మ ప్రేమంటే అదీ, ఇదీ అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం. ఇలా చేయడం వల్ల లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తాయే తప్ప అమ్మ ప్రేమను ఆస్వాదించలేరు.

ప్రతిరోజు బిజీబిజీగా సాగిపోయే జీవితంలో కనీసం మాతృదినోత్సవం రోజైనా తల్లితో ఉండండి. అమ్మని బయటకు తీసుకెళ్లి చిన్నప్పుడు మీరు చేసిన అల్లరీ.. అమ్మ చూపించిన ప్రేమను గుర్తుతెచ్చుకుంటూ ఆనందంగా గడపండి. నవమాసాలు మోసి, కష్టపడి పెంచిన ఆ తల్లి మీ నుంచి ఏమీ ఆశించదు.. కాస్తంత ప్రేమ తప్ప.

ఇవీ చదవండి..

ప్రేమ అనేది ఒక్క రోజుకే పరిమితమా...!

ABOUT THE AUTHOR

...view details