ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఓడించేందుకు.. అద్దె తారలతో దుష్ప్రచారం: లోకేశ్ - గల్లా జయదేవ్

నకిలీ ప్రచార తారలతో వైకాపా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. మంగళగిరిలో పర్యటించిన ఆయన...తెదేపా అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. జగన్ అండ్ కో...తనను ఓడించడానికి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

మంత్రి లోకేశ్

By

Published : Apr 3, 2019, 6:26 PM IST

మంత్రి లోకేశ్
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. తనను ప్రత్యక్షంగా ఎదుర్కొలేక.. వైకాపా నేతలు అద్దె తారలను రంగంలోకి దించుతుందన్నారు. వైకాపా నేతలు బెదిరింపుల రాజకీయాలకు సరైన సమాధానం చెబుతామని తెలిపారు. మంగళగిరికి చెందిన అమ్రిశెట్టి వెంకటేశ్వరరావు, మరో వెయ్యి మంది వైకాపా కార్యకర్తలు లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... నియోజకవర్గ అభివృద్ధి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. మంగళగిరిలో ఉంటానన్న ఐటీ మంత్రి... సమస్య ఏదైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బీసీలకు 10 వేల కోట్లతో ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. 2024నాటికి పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details