కడప జిల్లా రాయచోటిలో శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పర్యటించారు. తెల్లవారుజామున మార్నింగ్ వాక్ కింద పట్టణంలోని 3 నుంచి 7వ వార్డు దాకా అన్ని వీధులను పరిశీలించారు. అక్కడ నెలకొన్న పారిశుద్ధ్య సమస్య, తాగునీటి ఎద్దడిపై స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మురుగు నీటి కాలువలను నిత్యం శుభ్రపరిచి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని పురపాలక సిబ్బందికి ఆదేశించారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కార్మికులు బాగా పనిచేసి రాయచోటిని ఆదర్శ పురపాలికగా తీర్చిదిద్దాలని అధికారులు, కార్మికులకు సూచించారు. తాగునీటి సరఫరా రోజూ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు 100 శాతం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించాలని సిబ్బందికి సూచించారు. చెత్తను మురుగు కాలువలో వేయకుండా పురపాలిక డబ్బింగ్ స్థలంలోనే వేయాలని ప్రజలకు సూచించారు.
'రాయచోటిని ఆదర్శ పురపాలికగా మార్చండి' - chief whip
ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం కడప జిల్లా రాయచోటిలో పర్యటించారు. పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఎద్దడిపై స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై అధికారులతో చర్చించారు. రాయచోటిని ఆదర్శ పురపాలికగా తీర్చిదిద్దాలని సూచించారు.
'రాయచోటిని ఆదర్శ పురపాలికగా మార్చండి'