గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. ఈనామ్(ఆన్లైన్ టెండర్) పద్ధతి అమలు చేయోద్దంటూ.. నిమ్మకాయల రైతులు ఆందోళన చేశారు. రైతుకు మద్దతు ధర, అమ్మకంలో పారదర్శకత కల్పించాలనే ఉద్దేశంతో.. కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈనామ్‌పై కర్షకుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నిమ్మకాయల రైతులు.. తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టం జరగకుండా గిట్టుబాటు ధర అందించాలని కోరుతున్నారు.
"ఈనామ్".. మాకొద్దు... అన్నదాతల ఆందోళన - ap latest
రైతుకు మద్దతు ధర కల్పించే ఉద్దేశంతో.. మార్కెట్‌యార్డుల్లో అమలు చేస్తున్న ఈనామ్ విధానానికి వ్యతిరేకత ఎదురవుతోంది. తెనాలి మార్కెట్ యార్డులో నిమ్మకాయల రైతులు ఈనామ్ పద్ధతి వద్దంటూ ఆందోళన చేశారు.
!["ఈనామ్".. మాకొద్దు... అన్నదాతల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3724081-819-3724081-1562064078607.jpg)
మాకొద్దు..ఈనామ్ పద్ధతి: నిమ్మకాయల రైతులు
నిమ్మకాయల రైతుల ఆందోళన
'ఈనెల 4 నుంచి కచ్చితంగా అమలు చేస్తాం'
ఓ పక్క అన్నదాతలు ఆందోళనలు చేస్తుంటే... అధికారులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఆన్లైన్ టెండర్ విధానం ద్వారా తెనాలి వ్యవసాయ మార్కెట్లో ఈనెల 4నుంచి... నిమ్మకాయల క్రయవిక్రయాలను కచ్చితంగా జరుపుతామని తెలుపుతున్నారు.
ఇవీ చదవండి...'భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి'