ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

"కర్ణాటక ముఖ్యమంత్రిపై ఫిర్యాదు" - కుమార్​స్వామి

కర్ణాటకలో ఆడియో టేపు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి కుమారస్వామిపై పోలీసులకు భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. యడ్యూరప్పపై ఫిర్యాదు చేసి యువజన​ కాంగ్రెస్​ అదే బాటలో నడిచింది.

యడ్యూరప్ప vs కుమారస్వామి

By

Published : Feb 11, 2019, 7:39 AM IST

Updated : Feb 11, 2019, 8:01 AM IST

యడ్యూరప్ప vs కుమారస్వామి
ఆడియో టేపుల వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిపై విధాన సౌధ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు భారతీయ జనతా పార్టీ తెలిపింది. ఫోర్జరీ(463 సెక్షన్)​, నకిలీ దస్త్రాల తయారీ(ఐపీసీ 464) తదితర సెక్షన్​ల ప్రకారం ఫిర్యాదు చేసింది భాజపా.

విచారణ అనంతరం కుమారస్వామిపై క్రిమినల్​ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కాషాయ పార్టీ కోరుతోంది.

సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రయత్నిస్తున్నట్లు ఉన్న టేపును కుమారస్వామి శుక్రవారం విడుదల చేశారు. ఇందులో జేడీఎస్​ ఎమ్మెల్యే 'నగనగౌడ'ను కొనేందుకు అతని కుమారుడు' శరణ​గౌడ'తో యడ్యూరప్ప చర్చలు జరిపినట్లు ఉంది.

ఈ టేపులు నకిలీవని యడ్యూరప్ప మొదటి నుంచి చెబుతున్నారు. స్పీకర్​ను కొనటానికి తాను 50 కోట్లు ఇవ్వజూపారని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కుమారస్వామి నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని యడ్యూరప్ప ఆదివారం ప్రకటించారు.

శరణగౌడతో చర్చలు నిజమే...

ఆడియో టేపుల వ్యవహారంలో శరణగౌడతో చర్చలు జరిపిన మాట నిజమేనని యాడ్యూరప్ప ఒప్పుకున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే కొడుకును ముఖ్యమంత్రే తన వద్దకు పంపించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. ఆడియో టేపులో కుమారస్వామికి అనుకూలంగా ఉన్న భాగాన్ని మాత్రమే ఆయన విడుదల చేశారని మాజీ సీఎం ఆన్నారు.

కాంగ్రెస్​ కూడా....

ఎమ్మెల్యేలను డబ్బుతో కొనేందుకు యడ్యూరప్ప ప్రయత్నించారని సదాశివనగర్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు కర్ణాటక యువజన​ కాంగ్రెస్ ఒక ప్రకటనలో ​ తెలిపింది.

Last Updated : Feb 11, 2019, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details