ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రవాణాశాఖ ఆదాయాల్లో కృష్ణా జిల్లాదే అగ్రస్థానం - krishna

గడిచిన ఆర్థిక సంవత్సరంలో కృష్ణా జిల్లా రవాణ శాఖ అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. రూ. 445.56 కోట్లతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రత్యేక బృందాల తనిఖీలతోనే ఈ ఘనత సాధించామని జిల్లా ఉప రవాణాధికారి మీరాకుమార్​ వెల్లడించారు.

కృష్ణా జిల్లాదే అగ్రస్థానం

By

Published : Apr 28, 2019, 5:28 AM IST

Updated : Apr 28, 2019, 7:02 AM IST

ఎక్కువ రెవిన్యూ సాధించిన కృష్ణా రవాణా శాఖ

గత ఆర్థిక సంవత్సరంలో కృష్ణా జిల్లా రవాణా శాఖ అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2018-19 ఏడాది గానూ రూ. 445. 56 కోట్ల ఆదాయం లభించిందని జిల్లా ఉప రవాణాధికారి మీరా కుమార్​ తెలిపారు. వచ్చే ఫైనాన్షియల్​ ఇయర్​కు రూ. 509.97 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారని..అందులో 87. 36 శాతం మేరకు సాధించారని వెల్లడించారు. ఈ ఒక్క ఏడాదిలోనే రూ. 25.39 కోట్లు అధికంగా ఆర్జించగా.. 6.04 శాతం పెరుగుదల నమోదైందన్నారు. ప్రత్యేక బృందాల సారథ్యంలో త్రైమాసిక, జీవితకాలపు పన్నులు వసూలు..వాహన తనిఖీలు, ఫ్యాన్సీ నెంబర్ల వేలాల నుంచి అధిక రెవిన్యూ గడించామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి..వేసవిలోనూ..పచ్చని లోగిళ్లు

Last Updated : Apr 28, 2019, 7:02 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details