ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కాటన్​దొర గెస్ట్​హౌస్​లో సినిమా షూటింగ్​ - rajamandri

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండల ప్రాంతాల్లో 'కౌసల్య కృష్ణమూర్తి ' సినిమా చిత్రీకరణ​ మొదలైంది. ఎంపీ మాగంటి మురళీమోహన్​ ముహుర్తపు షాట్​కు క్లాప్​ కొట్టి షూటింగ్​ ప్రారంభించారు.

సినిమా షూటింగ్​

By

Published : Mar 13, 2019, 10:13 PM IST

పల్లెలో సినిమా షూటింగ్​ సందడి
తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులోని కాటన్​ దొర విశ్రాంతిగృహంలో 'కౌసల్య కృష్ణమూర్తి 'చిత్ర బృందం సందడి చేసింది. క్రియేటివ్​ కమర్షియల్స్​ బ్యానర్​పై కే. ఎస్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓ మహిళ క్రికెటర్​ ఎలా తన గమ్యాన్ని చేరుకుందనే అంశాన్ని కథా వస్తువుగా తీసుకున్నామని ఆయన తెలిపారు. ఎంపీ మాగంటి మురళీమోహన్​ ముహుర్తపు షాట్ కొట్టి చిత్రీకరణ ప్రారంభించారు. పచ్చని పరిసరాల్లో షూటింగ్​ జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎంపీ అన్నారు. చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు.ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్​ భీమినేని శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లుగా.. కార్తీక్​ రాజు, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు. తండ్రిపాత్రలో రాజేంద్రప్రసాద్, ప్రత్యేక పాత్రలో కమెడియన్ వెన్నెల కిషోర్​ అలరించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details