కావాలనే కేసులు బనాయిస్తున్నారు: కోడెల - kodela shiva prasad
తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మాజీ సభాపతి కోడెల అన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు సరికాదన్నారు. విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతోనే తెదేపా నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
kodela
తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా.. అవాస్తవ ఆరోపణలతో లక్ష్యం చేసుకున్నారని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాట్లాడిన ఆయన.. రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతో తెదేపా నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చివరి వరకూ పార్టీ, ప్రజల సేవకే అంకితమై ఉంటానని స్పష్టం చేశారు.