లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి వ్యతిరేకంగా పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరిలోని రాజ్‌నివాస్ ముందు ముఖ్యమంత్రి నారాయణ స్వామి చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను కిరణ్‌బేడీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు సీఎం. కేంద్ర ప్రభుత్వం కిరణ్ బేడీని వెనక్కి పిలవాలని డిమాండ్ చేశారు. సీఎం నారయణ స్వామి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి ధర్నాలో పాల్గొన్నారు.
" మంత్రివర్గ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి కిరణ్ బేడీకి ఎటువంటి అధికారాలు లేవు. ఆమె ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేస్తోంది. ప్రభుత్వ పాలనలో సమస్యలు సృష్టించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను ప్రోత్సహిస్తున్నారు. మాకు కేవలం తమిళనాడు నుంచే మద్దతు లభించటంలేదు దేశం మొత్తం మద్దతు పలుకుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీతో మాకు 39 విషయాలపై సమస్యలున్నాయి. " -నారాయణ స్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి
పలువురి మద్దతు