ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి.. వైకాపాలో చేరేందుకు నిర్ణయించారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె ఈరోజు హైదరాబాద్‌లో జగన్‌ను కలిశారు. ఈ నెల 28న అమరావతిలో ప్రతిపక్ష నేత జగన్ సమక్షంలో వైకాపాలో చేరేందుకు నిర్ణయించారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కృపారాణి... శ్రీకాకుళం నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా పోటీ చేశారు. 2009లో విజయం సాధించారు.యూపీఏ హయాంలో ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. విభజన అనంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగిన కృపారాణి.. సార్వత్రిక ఎన్నికలకు నేపథ్యంలో పార్టీ మారేందుకు నిర్ణయించారు.
కాంగ్రెస్‌కు కిల్లి టాటా.. 28న వైకాపాలోకి!
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఈ నెల 28న అమరావతిలో ప్రతిపక్ష నాయకుడు జగన్ సమక్షంలో ఆమె వైకాపాలో చేరనున్నారు.
కాంగ్రెస్‌కు కిల్లి గుడ్‌బై
ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్,అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్,అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు తెదేపాని వీడి జగన్ పార్టీలో చేరారు.తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారతారని ప్రచారం జరగ్గా..సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. కార్యకర్తల నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు చెందిన కృపారాణి.. వైకాపా బాట పట్టారు.