ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చంద్రబాబుతో కేశినేని భేటీ...పదవుల తిరస్కరణపై వివరణ - ap babu

తనకు లోక్​సభ పక్ష ఉపనేత, విప్​ పదవులు తిరస్కరిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని స్పష్టం చేశారు.  బుధవారం తెదేపా అధినేత చంద్రబాబుతో కూలంకషంగా చర్చించాక..తన నిర్ణయం తెలిపారు.

చంద్రబాబుతో కేశినేని భేటీ...

By

Published : Jun 6, 2019, 9:55 AM IST

చంద్రబాబుతో కేశినేని భేటీ.
లోక్​సభ పక్షఉపనేత, విప్​ పదవులు తిరస్కరిస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని తెదేపా అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు. ఆయనతో భేటీ అయిన నాని.. పలు విషయాలపై చర్చించారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు..అసంతృప్తికి గల కారణాలు వివరించారు. విజయవాడం ఎంపీగా మాత్రమే కొనసాగుతానని అధినేతకు తేల్చిచెప్పిన నాని..తెదేపాను వీడేది లేదని స్పష్టం చేశారు. బుధవారం లోక్​సభ పక్ష ఉపనేత, విప్​ పదవులకు సమర్థులను ఎన్నుకోండని ఫేసుబుక్​లో కేశినాని పోస్ట్​ చేసిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details