పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండల పరిషత్తు కార్యాలయం ముందు కత్తవపాటు గ్రామ మహిళలు ధర్నాకు దిగారు. తమ గ్రామంలో రక్షిత మంచి నీటి ప్లాంటు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ఇరగవరం రహదారిపై బైఠాయించారు. గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్న మహిళలు.. కలుషిత నీటిని తాగి రోగాలు బారిన పడుతున్నామని ఆవేదన చెందారు. ఈ సమస్యకు పరిష్కారంగా తమ గ్రామానికి చెందిన దాత ఒకరు...మంచినీటి ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వస్తే పంచాయతీ కార్యదర్శి అనుమతించటంలేదని గ్రామస్థులు ఆరోపించారు. ప్లాంటుకు భూమి పూజ చేస్తుంటే అడ్డుకున్నారని వివరించారు. మంచినీటి కోసం ఎన్నిసార్లు గ్రామం పంచాయతీ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, కనీసం దాతలు ముందుకొస్తే సహకరించటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దాతల సహకారంతో నిర్మించే రక్షిత మంచినీటి ప్లాంటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంచినీటి ప్లాంటు కోసం... మహిళల ఆందోళన - కత్తవపాటు
పశ్చిమ గోదావరి కత్తవపాటు గ్రామస్థులు ఆందోళన బాటపట్టారు. గ్రామంలో మంచి నీటి కష్టాలను చూసిన ఓ దాత.. రక్షిత మంచినీటి ప్లాంటు నిర్మించడానికి ముందుకొస్తే పంచాయతీ అధికారులు అడ్డుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అనుమతి ఇవ్వాలంటూ మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు.
![మంచినీటి ప్లాంటు కోసం... మహిళల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3679472-183-3679472-1561637941054.jpg)
మంచినీటి ప్లాంటు కోసం...మహిళల ఆందోళన