ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

భాజపాకు 200 సీట్లు దాటవు: కేఏ పాల్ - undefined

ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని.. ఈ ఎన్నికలను బహిష్కరించాలని తాను మొదట సూచించానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. ఇందుకోసం కలిసి పోరాడాలని మాయావతి, మమతా, అఖిలేశ్‌ తదితరులను కోరినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు.

pal

By

Published : May 22, 2019, 8:01 PM IST

భాజపాకు 200 సీట్లు దాటవు: కేఏ పాల్

భాజపాయేతర పక్షాల తీరుపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని తాను పిలుపునిస్తే.. ఏ రాజకీయ పార్టీ స్పందించలేదని దిల్లీలో వ్యాఖ్యానించారు. కౌంటింగ్ రోజున.. ఈవీఎంలకంటే ముందు వీవీ ప్యాట్​లు లెక్కించాలన్న 22 రాజకీయ పార్టీల విజ్ఞప్తిని ఈసీ తిరస్కరించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతి మంచిది కాదన్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు తక్కువని.. భాజపాకు 200కు మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదని అంచనా వేశారు. తమ పార్టీ అభ్యర్థుల బీ ఫామ్​లు ఎత్తుకెళ్లారని మరోసారి ఆరోపించారు. 30 నియోజకవర్గాల్లో రీ పోలింగ్ చేయాలని ఈసీని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ka-pal

ABOUT THE AUTHOR

...view details