'జగన్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొస్తారు' - hodha
వైఎస్ జగన్ ఘన విజయం సాధించడంపై సినీనటులు జీవిత, రాజశేఖర్, పృథ్వీలు స్పందించారు. జగన్ ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన మాట జగన్ నిలబెట్టుకుంటారని.. ఏడాదిలోనే ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారని జీవితారాజశేఖర్ దంపతులు ఆశాభావం వ్యక్తం చేశారు. వైకాపా గెలుపులో తాము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్న జీవిత, రాజశేఖర్.... తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటమి పట్ల జాలి చూపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను మరిపించేలా జగన్ ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తారని సినీ నటుడు పృథ్వీ తెలిపారు.