మహిళలకు చీర-సారె పథకం కింద 10 వేల 116 రూపాయలు ఇస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎన్నికల బహిరంగసభలో హామీ ఇచ్చారు.
PAWAN
By
Published : Apr 1, 2019, 2:05 PM IST
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
అందరికీ అన్నం పెట్టే రైతులు ఆనందంగా ఉండాలన్న పవన్‌కల్యాణ్... రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు నెలకు 5 వేల రూపాయల పింఛన్ అందిస్తామని మరోసారి పవన్ స్పష్టం చేశారు. పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామన్న పవన్...మహిళలకు చీర-సారె పథకం కింద 10 వేల 116 రూపాయలు ఇస్తామన్నారు.ఆదాయం, సంపదతో పని లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు పది గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.