ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తలాక్​ బిల్లును రద్దు చేస్తారా?మనస్సాక్షి ఉందా?: జైట్లీ

ముమ్మారు తలాక్ బిల్లుపై కాంగ్రెస్​ వైఖరిని కేంద్రమంత్రి, భాజపా నేత అరుణ్​జైట్లీ తప్పుబట్టారు. బరేలీ 'నిఖా-హలాలా' లాంటి ఘటనలు సైతం వారిలో మార్పు తీసుకురావడంలేదని మండిపడ్డారు.

అరుణ్​జైట్లీ, కేేంద్రమంత్రి

By

Published : Feb 8, 2019, 5:39 PM IST

"బరేలీ లాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ, వారి సభ్యులు పార్లమెంటులో 'ముమ్మారు తలాక్​' బిల్లు ఉపసంహరణకు హామీ ఇచ్చారు. వారు (కాంగ్రెస్​) కేవలం రాజకీయ లబ్ధికోసం ముస్లిం మైనారిటీలను ఆకట్టుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. వారి మనస్సాక్షి వారిని ప్రశ్నించడంలేదా?" అని అరుణ్​జైట్లీ ఫేస్​బుక్​లో ప్రశ్నించారు.

అవకాశవాద రాజకీయ నాయకులు పత్రికల్లో పతాక శీర్షికల్లో కనబడాలని చూస్తారు. కానీ జాతి నిర్మాతలు భవిష్యత్ గురించి ఆలోచిస్తారని జైట్లీ వ్యాఖ్యానించారు.

అప్పుడు...

గతంలో దివంగత రాజీవ్​గాంధీ కూడా 'షా బానూ' కేసులో ఇలాంటి తప్పే చేశారని అరుణ్​జైట్లీ విమర్శించారు. విడాకులు పొందిన మహిళలకు భృతి కల్పిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును కాదని రాజీవ్​ అన్యాయం చేశారని, ఫలితంగా మహిళలు పేదరికంలో మగ్గిపోయారని అరుణ్​జైట్లీ అన్నారు.

ఇప్పుడు...

32 సంవత్సరాల తరువాత అతని కుమారుడు రాహుల్ ​సైతం ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తున్నారని జైట్లీ విమర్శించారు.

నిఖా-హలాలా అంటే?

ఇటీవల బరేలీలో ఓ 'నిఖా-హలాలా' ఘటన వెలుగుచూసింది. భర్త నుంచి రెండు సార్లు తలాక్​చెప్పబడిన ఓ మహిళను ఇస్లామిక్​ చట్టం అనుసరించి బలవంతంగా నిఖా-హలాలా చేయమని ఒత్తిడి తెచ్చారు. మొదటిసారి మామతో, రెండోసారి తన భర్త సోదరుడితో నిఖా-హలాలా కార్యక్రమం నిర్వహించారు.

'నిఖా-హలాలా' ఆచారం ప్రకారం ఓ భర్త తను విడాకులు ఇచ్చిన భార్యను మరలా పెళ్లి చేసుకోలేడు. ఒక వేళ మళ్లీ ఆమెను పెళ్లి చేసుకోదలిస్తే ఆమెకు మరొకరితో వివాహం జరిగి విడాకులు తీసుకుని ఉండాలి. ఆ తరువాత ఆమె కొన్నాళ్లు ఏకాంతంగా ఉంటుంది. ఈ కాలాన్ని ఇద్దత్​ అంటారు. ఆ తరువాత ఆమెను మొదటి భర్త వివాహం చేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details