కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్! - cm
తెలంగాణలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం7.50 గంటలకు తాడేపల్లిలో బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. 9 గంటల 30 నిమిషాలకు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ చేరుకుంటారు. 10.15 గంటలకు కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం.. 11 గంటలకు కన్నెపల్లికి బయల్దేరతారు. 11.40 గంటలకు అక్కడే పంపు హౌజ్ ప్రారంభోత్సవానికి హాజరై.. మధ్యాహ్నం 1.30కు భోజనం అనంతరం రాష్ట్రానికి తిరుగు పయనమవుతారు.