అవినీతికి ఆస్కారం లేని పాలన చేస్తానని పదేపదే చెబుతున్న సీఎం జగన్... రాష్ట్ర మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓఎస్డీ, వ్యక్తిగత కార్యదర్శి, పీఏలను నియమించేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని సహచరులకు సూచించారు. ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారో తనకు తెలియజేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లోకి తీసుకోవద్దని సూచించారు . ఈ విషయాలను ప్రస్తావిస్తూ...సీఎం కార్యాలయం ప్రధాన సలహాదారు అజేయ కల్లం నుంచి మంత్రులకు లేఖలు పంపించారు.
మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకంపై సీఎం దృష్టి - ap politics
మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకంపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని ఆదేశించారు.
మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకంపై సీఎం దృష్టి