మధ్యాహ్న భోజన పథకం అమలుతీరుపై సీఎం జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకంపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న జగన్...ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజన పథకంపై సీఎం జగన్ సమీక్ష - జగన్
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలు తీరు తెన్నులపై అధికారులు, అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి..విద్యార్థుల సంఖ్యను పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.
పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనపై సీఎం ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం, తాగునీరు, ఇతర వసతులు కల్పన పకడ్బందీగా అమలుచేసేలా అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎటువంటి రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వంటశాలలు పటిష్ఠంగా నిర్మించాలని సీఎం అన్నారు. తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి :జూన్ 8న సచివాలయానికి జగన్.. రేపటినుంచి సమీక్షలు