జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో సీఎం జగన్ భేటీ - jagan meet justice praveen kumar
తాత్కాలిక సీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌పై జ్యుడీషియల్ కమిటీ వేసే అంశంతో పాటు అనేక అంశాలపై చర్చించారు.

jagan-meet-justice-praveen-kumar
జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో సీఎం భేటీ
ఉండవల్లిలోని హైకోర్టు తాత్కాలిక సీజే నివాసంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటించడం కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేతో చర్చించారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో 45 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో సీఎం పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.సీజే నివాసానికి వెళ్లిన జగన్ వెంట న్యాయనిపుణులు, ఇతర నేతలు ఉన్నారు.
Last Updated : Jun 4, 2019, 7:17 PM IST