ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'సీబీఐకి ఇవ్వకుంటే న్యాయ పోరాటమే'

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గవర్నర్‌కు వైకాపా అధినేత జగన్‌ విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. సీబీఐ దర్యాప్తునకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.

వైకాపా అధినేత జగన్‌

By

Published : Mar 16, 2019, 5:22 PM IST

Updated : Mar 16, 2019, 5:36 PM IST

గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన జగన్
మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ప్రభుత్వమే చేయించిందని ఆరోపిస్తున్న ప్రతిపక్షనేత జగన్‌... గవర్నర్‌తో సమావేశమయ్యారు. అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని వైకాపా నేతలను హతమార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన చిన్నాన్న హత్య కేసును కేంద్రదర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు లేవన్న జగన్... ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఏ తప్పూ చేయకుంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. పక్కా పథకం ప్రకారం చేసిన హత్య చేశారని ఆరోపించారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సహాయపడుతున్నారని ఆరోపించారు.
Last Updated : Mar 16, 2019, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details