ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

గవర్నర్​తో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ - jagan meet governor

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడారు. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. విభజన సమస్యలపై జగన్ తో కలిసి గవర్నర్ తో మాట్లాడారు.

jagan

By

Published : Jun 1, 2019, 6:27 PM IST

గవర్నర్​తో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గవర్నర్​ నరసింహన్​ను హైదరాబాద్ రాజ్​భవన్​లో కలిశారు. ఈ సందర్భంగా.. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తీసుకున్న నిర్ణయాలు, ఉన్నతాధికారుల బదిలీలు, డీజీపీ నియామకంతో పాటు.. ఆర్థిక శాఖ పలు ఇతర విభాగాల సమీక్షలపై.. గవర్నర్​తో ముఖ్యమంత్రి మాట్లాడినట్టు సమాచారం. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జగన్ తో కలిసి గవర్నర్ తో మాట్లాడారు. విభజన అంశాలు, ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యలపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details