ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అధికారుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్ - dgp

సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్...తన ఆలోచనలకు పనిచేసేలా అధికార బృందాన్ని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ల విషయంలో ఓ స్పష్టతకు వచ్చిన జగన్..ఇక సీఎం కార్యాలయంలో పనిచేసే అధికారుల విషయంలోనూ కసరత్తు చేస్తున్నారు.

అధికారుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్

By

Published : May 28, 2019, 8:03 AM IST

Updated : May 28, 2019, 1:37 PM IST

అధికారుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్
ముఖ్యమంత్రిగా తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే అధికారుల బృందాన్ని ఎంపిక చేసుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను ఎంపిక చేసుకున్న జగన్ .. ఇంటెలిజెన్స్ చీఫ్ గా తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐజీ స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేసుకున్నారు. రాష్ట్ర క్యాడర్ బదిలీకి కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి రాగానే జగన్ బృందంలో స్టీఫెన్ చేరనున్నారు. ఇక సీఎం కార్యాలయంలో పనిచేసే అధికారుల విషయంలోనూ కసరత్తు కొనసాగుతోంది.
రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న జగన్...అంతకుముందే తన అధికార గణాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు.పోలీసు బాస్ గా ఇప్పటికే గౌతమ్ సవాంగ్ ఖరారు అయిపోయారు. ప్రస్తుతం విజిలెన్సు డీజీగా పనిచేస్తున్న ఆయన .. ఇప్పటికే ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి .. ఇతరత్రా అంశాలపై పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నెల 30 తేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారుల నియమాకాలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. సీఎంఓలో కార్యదర్శులుగా సీనియర్ అధికారి పీవీ రమేష్, ధనుంజయ్ రెడ్డి, ధర్మారెడ్డి, ఆదిత్యనాథ్ దాస్ ల పేర్లు ఖరారు అయినట్టు తెలుస్తోంది.
తన పాలన ఎలా ఉంటుందన్న అంశాలను ఇప్పటికే దిల్లీలో నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో స్పష్టం చేసిన జగన్ .. తన టీమ్ ఎలా ఉండాలన్న అంశాన్ని సలహాదారు అజయ్ కల్లామ్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఇప్పటికే తేల్చి చెప్పినట్టు సమాచారం.
Last Updated : May 28, 2019, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details