ఈ ఉదయం హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లి జగన్ మోహన్ రెడ్డి... ప్రధానితో భేటీ అయ్యారు. దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా 7రేస్ కోర్సులోని ప్రధాని నివాసానికి చేరుకున్న ఆయన... ప్రధానితో సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీని కలుసుకొని.. ఈనెల 30న జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలపారు. రాష్ట్రంలోని సమస్యలూ ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికిప్రత్యేక హోదా ఇవ్వాలనిప్రధాని మోదీకి జగన్ విజ్ఞప్తి చేశారని సమాచారం. రాష్ట్రవిభజన చట్టంలోని హామీలు సత్వరమే నెరవేర్చాలని కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించికేంద్రం సాయమందించాలని అభ్యర్థించారని తెలుస్తోంది. జగన్‌తో పాటు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్‌రెడ్డి, నందిగం సురేశ్, బాలశౌరి ఈ భేటీలో పాల్గొన్నారు.
ప్రధాని మోదీతో జగన్ భేటీ... ప్రమాణస్వీకారానికి ఆహ్వానం - ప్రధాని
రాష్ట్రంలో సంచలన విజయం సాధించిన జగన్ ప్రధానితో సమావేశమయ్యారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పి... తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.
ప్రధాని మోదీతో జగన్ భేటీ..
Last Updated : May 26, 2019, 12:21 PM IST