ఐటీ సోదాలు ప్రత్యర్థుల పన్నాగమేనని తెదేపా నేత సుధాకర్ యాదవ్ తెలిపారు. ఓడిపోతామనే భయంతోనే ఆదాయపు పన్ను శాఖతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. చట్టానికి లోబడే తన కంపెనీలు పని చేస్తున్నాయన్న యాదవ్...ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. సుమారు రూ.500 కోట్ల టర్నోవర్ ఉన్న తన కంపెనీలన్నీ ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్టే ఉన్నాయనితెలిపారు. సోదాలు చేసిన అధికారులు తన ఇంటి వద్ద ఎటువంటి పత్రాలు, వస్తువులు స్వాధీనం చేసుకోలేదని యాదవ్ అన్నారు. తెదేపా నేతలను భయందోళనలకు గురిచేసేందుకు వైకాపా, భాజపా కుమ్మక్కై ఈ దాడులు చేయించిందని ఆరోపించారు.
దాడికి నిరసనగా పుట్టా సుధాకర్ యాదవ్ సోదరుడు ఆందోళన చేపట్టారు. అధికారుల ఆకస్మిత తనిఖీలను కుట్రపూరితమైన చర్యగా వర్ణింంచారు. సుధాకర్ యాదవ్పై జరిగిన ఐటీ దాడులకు ఎంపీ సీఎం రమేశ్ సంఘీభావం తెలిపారు. ఐటీ అధికారులను నిలువరించేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను వారించారు.
ప్రొద్దుటూరులో ఐటీ కలకలం.. పుట్టా సుధాకర్ ఇంట్లో సోదాలు - ఐటీ దాడులు
తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంపై బుధవారం సాయంత్రం ఐటీ సోదాలు జరిగాయి. కడప, ప్రొద్దుటూరు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. దాడులు జరుగుతున్న సమయంలో సుధాకర్ యాదవ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులను నిలువరించేందుకు ప్రయత్నించిన నేతలను ఎంపీ సీఎం రమేశ్ వారించారు. రాజకీయంగా తనను ఎదుర్కొలేకే ఇలాంటి పిరికిపంద చర్యలు చేస్తున్నారని పుట్టా సుధాకర్ ఆరోపించారు.
తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్
ఇవీ చూడండి :చంద్రబాబు.. అంతకు ముందు..ఆ తర్వాత!