ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అంతరిక్షరంగంలో యువత నైపుణ్యం సాధించాలి: ఇస్రో ఛైర్మన్​ - ఇస్రో ఛైర్మన్​ శివన్​

అంతరిక్ష రంగంలో యువత నైపుణ్యం సాధించేందుకు ప్రభుత్వం యువిక కార్యక్రమం తీసుకొచ్చిందని.. ఇస్రో ఛైర్మన్​ శివన్​ అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్​ ధవన్​ అంతరిక్ష కేంద్రంలో పాఠశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖిలో పాల్గొన్నారు.

ఇస్రో ఛైర్మన్​

By

Published : May 18, 2019, 4:22 PM IST

శ్రీహరి కోటలో యువిక

యువత అంతరిక్ష, సాంకేతిక రంగాల్లో నైపుణ్యం పొందేలా కేంద్ర ప్రభుత్వం యువిక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్​ కేంద్రంలో ఈ రోజు యువిక-2019 కార్యక్రమం జరిగింది. ఇస్రో ఛైర్మన్​ శివన్​ హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటింటారు.

జై విజ్ఞాన్​, జై అనుసంధాన్​ల లాగే యువిక-2019 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని శివన్ చెప్పారు. యువత అంతరిక్షంతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. నాణ్యత, పారదర్శక సేవలతోనే ఇస్రో అగ్రాగామిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూమికి 450 కిలోమీటర్ల దూరంలో గగన్​యాన్​ ప్రయోగం వారంరోజులుగా జరుగుతుందని వెల్లడించారు. ఆదిత్య ఎల్​ఐ ప్రయోగం 1.5 బిలియన్​ కిలోమీటర్ల దూరంలో ఉండే బిందువు వద్ద జరుపుతామని తెలిపారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని దేశ భవిష్యత్తుకు పాటుపడాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి.వేట కుక్కల దాడిలో జింక మృతి

ABOUT THE AUTHOR

...view details