ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

9 జిల్లాలకు కొత్త పోలీస్ బాస్​లు.. - cm

రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఈ మధ్యే.. 36 మంది ఐఏఎస్​లు, నలుగురు ఐపీఎస్ లకు ఒకేసారి స్థానచలనం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

cm-dgp

By

Published : Jun 5, 2019, 9:11 PM IST

Updated : Jun 6, 2019, 9:21 AM IST

ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే 36 మంది ఐఏఎస్​లు, నలుగురు ఐపీఎస్ లకు ఒకేసారి స్థానచలనం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా... 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

జిల్లాలు, విభాగాలకు ఎస్పీల మార్పు

శ్రీకాకుళం జిల్లా అమ్మిరెడ్డి
విజయనగరం జిల్లా బి.రాజకుమారి
తూర్పుగోదావరి జిల్లా నయీం హష్మి
పశ్చిమగోదావరి జిల్లా నవదీప్‌సింగ్
కృష్ణా జిల్లా రవీంద్రబాబు
గుంటూరు జిల్లా అర్బన్ పీహెచ్‌వీ రామకృష్ణ
గుంటూరు జిల్లా గ్రామీణం జయలక్ష్మి
చిత్తూరు జిల్లా సీహెచ్ వెంకటప్పలనాయుడు
అనంతపురం జిల్లా బి.సత్య ఏసుబాబు
అనంతపురం పీటీసీ ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్
సీఐడీ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
ఇంటెలిజెన్స్ ఎస్పీ అశోక్‌కుమార్
ఎస్‌ఐబీ ఎస్పీ రవిప్రకాశ్
ఆక్టోపస్ ఎస్పీ విశాల్ గున్ని
రైల్వే ఎస్పీ కోయ ప్రవీణ్

ఇతర విభాగాలకు ఐపీఎస్ అధికారుల మార్పు

విశాఖ డీసీపీ-1 విక్రాంత్ పాటిల్
విశాఖ డీసీపీ-2 ఉదయ్‌భాస్కర్
విజయవాడ సంయుక్త సీపీ నాగేంద్రకుమార్
విజయవాడ డీసీపీ-2 సీహెచ్ విజయరావు
ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్
కర్నూలు డీఐజీ టి.వెంకట్రామిరెడ్డి
సీఐడీ డీఐజీ త్రివిక్రమ్ వర్మ
గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌ రాహుల్‌దేవ్ శర్మ
అనంతపురం పీటీసీ ప్రిన్సిపల్ ఘట్టమనేని శ్రీనివాస్
హెడ్ క్వార్టర్స్​కు అటాచ్ ఏఆర్ దామోదర్
హెడ్ క్వార్టర్స్​కు అటాచ్ భాస్కర్ భూషణ్
హెడ్ క్వార్టర్స్​కు అటాచ్ రాజశేఖరబాబు

అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి.. ముఖ్యమంత్రి జగన్ తన టీమ్ ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. డీజీపీ ఠాకూర్​ను మార్చేసి.. సవాంగ్ కు బాధ్యతలు అప్పగించారు. విశ్రాంత ఐఏఎస్ అజేయ కల్లాంను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. పది మందితో ఆయనకు ప్రత్యేక పేషీ ఏర్పాటు చేశారు. 9 జిల్లాలకు కలెక్టర్లను మార్చారు. కార్పొరేషన్ల చైర్మన్లను మార్చారు. తాజాగా.. ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరి కొద్ది రోజుల్లోనే మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్న ముఖ్యమంత్రి జగన్.. ఆ లోపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాలనను పరుగులు పెట్టించేందుకు.. తనదైన టీమ్​ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

Last Updated : Jun 6, 2019, 9:21 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details