ఏం చూసి జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలి?: చంద్రబాబు
ఒక్క అవకాశం ఇవ్వటానికి జగన్ కు ఉన్న అర్హత ఏంటీ... నేరచరిత్ర, 31 కేసులున్న వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగించటం...ఆత్మహత్యతో సమానం అని ఈటీవీ భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు తెలిపారు.
చిన్నఉద్యోగానికి సైతం అభ్యర్థి గత చరిత్ర, వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. విదేశాల్లోకి అనుమతి ఇవ్వాలన్నా అనేక రకాలుగా విచారణ చేస్తారు. పెళ్లి విషయంలోనూ అబ్బాయి అలవాట్ల గురించి తెలుసుకుని వివాహం చేస్తాం. జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మరణశాసనం రాసుకోవాలా? జగన్‌కు అవకాశమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టరు. కేసులు మాఫీ అయితే చాలని ఆలోచిస్తున్న జగన్... వైకాపాను భాజపాలో విలీనం చేస్తారని చంద్రబాబు తెలిపారు.