ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.మొదటి సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు కలిపి మెుత్తం 71 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి ప్రకటించారు. పరీక్షకు 4 లక్షల 76వేల 410మంది విద్యార్ధులు హాజరుయ్యారు. మార్చిలో నిర్వహించిన పరీక్షలో 2లక్షల 86వేల 932 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీలో 53వేల 25మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో రెగ్యూలర్, సప్లిమెంటరీ కలిపి 87శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.రెండో సంవత్సర సప్లమెంటరీ పరీక్షల్లో 66 వేల 114 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ కోర్సుల్లో మెుదటి సంవత్సరం విద్యార్థులు 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా...రెండో సంవత్సరంలో 81 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఆన్లైన్లో అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్