ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వీసా కేసు: అమెరికాలో నలుగురు భారతీయులు అరెస్టు - H1B

అమెరికాలో నలుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. హెచ్1 వీసా ప్రక్రియను వేగవంతం చేయడానికి తప్పుడు పత్రాలు సృష్టించినట్లు వీరు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

Indians arrest in america for H1 b visa issue

By

Published : Jul 3, 2019, 7:50 PM IST

స్వప్రయోజనాల కోసం.... హెచ్1బీ వీసాలను మోసపూరితంగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై రెండు ఐటీ కంపెనీలకు చెందిన నలుగురు భారతీయులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. వారిలో.. ఇద్దరు తెలుగు వాళ్లూ ఉన్నారు. వారిని రెండు లక్షల యాభై వేల అమెరికన్‌ డాలర్ల పూచీకత్తుపై విడుదల చేశామని అమెరికా న్యాయ విభాగం తెలిపింది.

న్యూజెర్సీలో నివాసం ఉంటున్న.... విజయ్ మానె, వెంకటరమణ మన్నం, సతీష్‌ వేమూరి, ఫెర్డినాండో శిల్వాపై వీసా నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొన్నారు. విజయ్, వెంకటరమణ, సతీష్ కలిసి.. న్యూజెర్సీ ప్రాంతంలో ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఉద్యోగులను అందించే సంస్థలు నడిపేవారు. శిల్వా కూడా అదే ప్రాంతంలో... క్లైంట్ - ఏ అనే సంస్థను నడుపుతున్నాడు.

అమెరికాలో ఉద్యోగం కోసం ఉపయోగపడే హెచ్ 1 బీ వీసాలను.... విదేశీ నిపుణులకు ప్రొక్యూర్ ప్రొఫెషనల్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ ద్వారా అందిస్తున్నారు. వీసా దరఖాస్తులను వేగవంతం చేసుకోవడానికి..... దరఖాస్తుదారులు ఇదివరకే క్లైంట్ - ఏ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని.... అమెరికా న్యాయ విభాగం తెలిపింది. తద్వారా తమ పోటీ సంస్థల కంటే ముందుగానే.... ఎలాంటి వీసా అడ్డు లేకుండా ఉద్యోగులను అమెరికాకు రప్పించే ప్రయత్నాలు చేశారని ఆరోపించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details