ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'మేనేజ్​మెంట్​ విద్యా ప్రమాణాల్లో ఐఐఎంలు ఉత్తమం' - vizag iim

విశాఖ ఐఐఎం తొలి పరిశోధక బ్యాచ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ నూతన బ్యాచ్​కు స్వాగతం పలికేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఐఐఎం బోర్డు ఆఫ్ గవర్నర్స్ సభ్యురాలు ఆర్. హరిత పాల్గొన్నారు.

మేనేజిమెంట్​ విద్యా ప్రమాణాలలో ఐఐఎంలు ఉత్తమం : ఐఐఎం బీఓజీ సభ్యురాలు హరిత

By

Published : Jun 24, 2019, 10:08 PM IST

Updated : Jun 24, 2019, 11:17 PM IST

మేనేజిమెంట్​ విద్యా ప్రమాణాలలో ఐఐఎంలు ఉత్తమం : ఐఐఎం బీఓజీ సభ్యురాలు హరిత

విశాఖ ఐఐఎం మరో మైలురాయిని చేరుకుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న ఐఐఎంలకు దీటుగా పరిశోధనలు చేస్తోంది. ఇందుకుగాను పరిశోధక విద్యార్థుల మొదటి బ్యాచ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. విశాఖ ఐఐఎం మిగిలిన ఐఐఎంల కంటే మెరుగైన స్థానంలో నిలుస్తుందని ఈ సంస్థ డైరక్టర్ చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన బ్యాచ్ విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో.. ఐఐఎం బోర్డు ఆఫ్ గవర్నర్స్ సభ్యురాలు మాళవిక ఆర్. హరిత మాట్లాడారు. మేనేజ్​మెంట్ విద్యలో ప్రమాణాలను ఉన్నతంగా నిలపడంలో, విలువలతో కూడిన విద్యను అందించడంలో ఐఐఎంలు ముందున్నాయన్నారు. ఈ క్రమంలో కొత్త ఐఐఎంలలో విశాఖ ఐఐఎం మంచి స్థానంలో ఉందని ఆమె ప్రశంసించారు.

Last Updated : Jun 24, 2019, 11:17 PM IST

ABOUT THE AUTHOR

...view details