ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పట్టాలెక్కిన 'వందేభారత్​ ఎక్స్​ప్రెస్​'

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్​ రహిత 'వందే భారత్​ ఎక్స్​ప్రెస్​'ను ఇవాళ మోదీ ప్రారంభించారు.

పట్టాలెక్కిన 'వందేభారత్​ ఎక్స్​ప్రెస్​'

By

Published : Feb 15, 2019, 1:10 PM IST

పట్టాలెక్కిన 'వందేభారత్​ ఎక్స్​ప్రెస్​'
భారత్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 'వందేభారత్ ఎక్స్‌ప్రెస్​'ను ఇవాళ దిల్లీలో మోదీ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. పుల్వామా ఉగ్రవాద ఘటన నేపథ్యంలో మోదీ ర్యాలీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

మేకిన్ ఇండియాలో భాగంగా భారత తొలి ఇంజిన్​ రహిత రైలు 'వందే భారత్​ ఎక్స్​ప్రెస్​'ను చెన్నై ఇంటిగ్రల్ కోచ్​ ఫ్యాక్టరీ తయారుచేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ రైలును తొలుత ‘'ట్రైన్‌18'’గా పిలిచారు. ఇటీవలే కేంద్రం '‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌'’గా దీనికి నామకరణం చేశారు. 16 బోగీలు ఉన్న ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా దీనికి పేరుంది. దిల్లీ-వారణాసి మధ్య ఇది‌ రాకపోకలు సాగించనుంది.

ABOUT THE AUTHOR

...view details