రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి అనూహ్య స్పందన వ్యక్తమవుతోంది. ఈ నెల 23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణాల్లో డిగ్రీ చదివినవారు, గ్రామాల్లో ఇంటర్, ఇంటర్‌తో సమానమైన పరీక్ష పాసైన వారు అర్హులుగా ప్రభుత్వం తెలిపింది. ఏజెన్సీ ఏరియాల్లో పదో తరగతి పాసైన వారు అర్హులుగా తెలిపింది. అన్ని ప్రాంతాల నుంచి నిరుద్యోగులు వీటికోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారు.
గ్రామ వాలంటీర్ పోస్టులకు అనూహ్య స్పందన - గ్రామ వాలంటీర్లు
గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌కు ఇప్పటి వరకూ 5.82 లక్షల హిట్స్ వచ్చాయని ఆర్టీజీఎస్ తెలిపింది. ఈ నెల 23 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియలో ఇప్పటికి వరకూ 82 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
గ్రామ వాలంటీర్ పోస్టులకు అనూహ్య స్పందన
http://gramavolunteer.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ వ్యవహారాన్ని రియల్ టైం గవర్నెన్స్ టీం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ వెబ్‌సైట్‌కు రెండు రోజుల్లో 5.82 లక్షల హిట్స్ రాగా..మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 82 వేల మంది దరఖాస్తులు వచ్చినట్లు ఆర్టీజీఎస్ తెలిపింది.