ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో 3300 కిలోల గంజాయి పట్టివేత

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశాలోని గిరిజన ప్రాంతాల నుంచి సుమారు 100 మంది కావిళ్లతో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఒడిశా మత్తిలీ ప్రాంతంలో 34 మంది స్మగర్లు అదుపులోకి తీసుకున్నారు.

ganjayi

By

Published : Jun 9, 2019, 12:07 AM IST

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో 3300 కిలోల గంజాయి పట్టివేత

ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండలో భారీ మొత్తంలో జరుగుతున్న గంజాయి అక్రమరవాణను మల్కాన్‌గిరి పోలీసులు భగ్నం చేశారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీ జగ్‌మోహన్‌ మీనా తెలిపిన సమాచారం ప్రకారం ఈ నెల 5, 6 తేదీల్లో దాదాపు 100 మంది కావిళ్లతో కాలినడకన చిత్రకొండ ప్రాంతం నుంచి చత్తీస్​ఘడ్​కు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో...పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బలిమెలకు చెందిన ఒక కానిస్టేబుల్​కు గాయాలవగా కోరాపుట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటన అనంతరం 75 మందితో ఎస్​ఓబీ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ బలగాలు ఒడిశా మత్తిలీ ప్రాంతంలో గాలిస్తుండగా 34 మంది స్మగర్లు పోలీసులకు తారసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. 3300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని...ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో కోరాపుట్, మల్కాన్‌గిరి, నవరంగపూర్‌, చత్తీస్‌ఘడ్‌కు చెందిన స్మగర్లు ఉన్నారని తెలిపారు.

ఇవీ చూడండి : 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్న నైరుతి

ABOUT THE AUTHOR

...view details