ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు - జీవో

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే ఈ నెల 11వ తేదీ గురువారం రోజున.. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో జారీ చేసింది.

అనిల్ చంద్ర పునేఠ

By

Published : Apr 4, 2019, 6:38 PM IST

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే ఈ నెల 11వ తేదీన.. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో జారీ చేసింది. పోలింగ్ ముందురోజు అయిన పదో తారీఖుతో పాటు కౌంటింగ్ జరిగే మే 23న స్థానిక సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. పోలింగ్ రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ తెలిపారు.

ప్రైవేటు సంస్థలు సెలవు ఇవ్వాల్సిందే

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకునే నిమిత్తం కార్మిక చట్టాలను అనుసరించి... రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలన్నారు. కౌంటింగ్ జరిగే మే 23వ తేదీన స్థానికంగా సెలవు మంజూరు చేసే అధికారం జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. స్థానిక సెలవుల రోజున ట్రెజరీ, సబ్ ట్రెజరీ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని వెల్లడించారు.

ఇవీ చదవండి..

హోరాహోరి పోరులో ప్రకాశించేదెవరు..?

ABOUT THE AUTHOR

...view details