గుంటూరు జిల్లా కేసానుపల్లి గ్రామంలో ఉన్న తన భూమిని ఖాళీ చేయాలని విజయలక్ష్మి అనుచరులు బెదిరించారని విజయప్రసాద్ అనే వ్యక్తి నరసారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు..ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ఈ నెల 12న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోడెల కుమార్తెను మూడో నిందితురాలిగా చూపారు. పోలీసులు నమోదు చేసిన కేసులో తన పేరును రద్దు చేయాలని, అరెస్ట్ నిలువరించాలని విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. భూ వివాదంతో పిటీషనర్‌కు సంబంధం లేదని..రాజకీయ దురుద్దేశంతో కేసు పెట్టారని, కేసు రద్దు చేయాలని పిటీషనర్ తరఫు న్యాయవాది కోరారు. కేసు దర్యాప్తు విచారణ దశలో ఉందని..పూర్తిస్థాయి నిజానిజాలు తేలకుండా కేసులో పేరు రద్దు చేయటం సరికాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విజయలక్ష్మిని అరెస్టు చేయవద్దని.. కేసు దర్యాప్తు సాగించమని పోలీసులను ఆదేశించింది. ప్రతివాదులు కోర్టుకు ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని తెలిపింది. ఈ కేసును జూలై 11కు వాయిదా వేసింది.
కోడెల కుమార్తెకు హైకోర్టులో ఊరట..అరెస్టు వద్దని ఆదేశాలు - కోడెల కుమార్తె
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. గుంటూరు జిల్లా నరసారావుపేట గ్రామీణ పోలీసులు కోడెల కుమార్తెపై ఈ నెల 12న కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించి ఆమెను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కేసును జూలై 11కు వాయిదా వేసింది.
కోడెల కుమార్తెకు హైకోర్టులో ఊరట..అరెస్టు వద్దని ఆదేశాలు
ఇ
దీ చదవండి :'కోడెల కుమారుడు, కుమార్తెపై 10 కేసులు నమోదు'