పసుపు కుంకుమ ,అన్నదాత సుఖీభవ పథకాల చెల్లింపుల నిధుల విడుదలను నిలువరించటానికి హైకోర్టు నిరాకరించింది. మూడో విడత నిధుల విడుదలకు భారత ఎన్నికల సంఘం అనుమతిచ్చిందని తెలిపింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే లబ్ధిదారులకు పోస్టు డేటెడ్ చెక్కులు ఇచ్చామని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ పథకం కొత్తగా ప్రవేశపెట్టింది కాదన్నారు. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసినందున తాము జోక్యం చేసుకోవటం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఆ పథకాల విషయంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు
అన్నదాతా సుఖీభవ, పసుపు- కుంకుమ పథకాలతు మార్గం సుగమం అయింది. ఈ రెండు పథకాల చెల్లింపుల నిధుల విడుదల నిలుపుదలను హైకోర్టు నిరాకరించింది. దిల్లీ హైకోర్టులో వ్యాజ్యం ఉండగా మా జోక్యం సరికాదని ధర్మాసనం తెలిపింది.
ఆ పథకాల విషయంలో జోక్యం చేసుకోలేం
ఏజీ,ఈసీఐ తరపు న్యాయవాది వాదనలను నమోదు చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సంక్షేమ పథకాల పేరుతో చెల్లింపులు ,ఖాతాలో సొమ్ము జమచేయటాన్ని నిలువరించేలా... ఆదేశించాలని అభ్యర్థిస్తూ అనిల్ అనే వ్యక్తి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను ధర్మాసనం వాయిదా చేసింది