తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కడప వాసులకు భారీ వర్షంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. సాయంత్రం 5. 30 గంటల నుంచి గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో.. రోడ్లన్ని నీటితో మునిగిపోయాయి. మురికి కాలువలు పొంగి పొర్లాయి. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న నగర వాసులు.. వాతవరణం చల్లబడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కడపలో భారీ వర్షం.. చల్లబడిన నగరం - వాన
సూర్యతాపంతో అల్లాడుతున్న కడప వాసులకు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో నగరంలోని రోడ్లన్ని వరదమయం అయ్యాయి.
చల్లబడిన నగరం