విశాఖపట్నం జిల్లాలో హనుమాన్ జయంత్యోత్సవాలు శోభాయామానంగా జరిగాయి. భీమిలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉదయం నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. పాలభిషేకాలు, గణపతి- గాయత్రి హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిట్టివలసలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచముఖ ఆంజనేయ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. శారదా పీఠంలోని శ్రీదాసాంజనేయ స్వామికి పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సమక్షంలో విశేష పూజలు జరిగాయి. ఉక్కునగరంలోని సాయి మందిరంలో హనుమాన్ చాలీసా ఆలపించారు. ఈ కార్యక్రమానికి మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పంచముఖ ఆంజనేయునికి పాలాభిషేకం - panchamuka anjaneya
విశాఖపట్నం జిల్లాలో ఆంజనేయుని జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. భీమిలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిట్టివలసలోని పంచముఖ ఆంజనేయ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
పంచముఖ ఆంజనేయునికి పాలాభిషేకాలు