ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

హైదరాబాద్​లో రూ.8 కోట్ల నగదు పట్టివేత - భారీగా అక్రమ నగదు

ఎన్నికలకు రెండురోజుల ముందు హైదరాబాద్​లో భారీగా నగదు పట్టుబడింది. హిమాయత్​ నగర్​ వద్ద కారులో రూ.2 కోట్లు తరలిస్తుండగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. కారులో వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు నారాయణగూడ ఇండియన్​ బ్యాంకు నుంచి భాజపా అధికారిక ఖాతాలో మరో రూ.6 కోట్లు తీస్తుండగా దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా డబ్బు తరలిస్తున్న వారిని అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హైదరాబాద్​లో రూ.8 కోట్ల నగదు పట్టివేత

By

Published : Apr 8, 2019, 8:01 PM IST

హైదరాబాద్​లో రూ.8 కోట్ల నగదు పట్టివేత

హైదరాబాద్​ నారాయణగూడ పైవంతెన వద్ద రూ. 8 కోట్ల నగదును మధ్య మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్​ బ్యాంకు నుంచి భాజపా కార్యాలయ సిబ్బంది డబ్బు విత్​డ్రా చేసి తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడి చేశారు. మొదట హిమాయత్​ నగర్ వద్ద కారు తనిఖీల్లో రూ.2 కోట్లు పట్టుకున్నారు. ప్రదీప్​, శంకర్​ అనే వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు నారాయణగూడ బ్యాంకు వద్ద గోపీ అనే వ్యక్తి రూ.6 కోట్లు విత్​ డ్రా చేస్తుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో గోపి, చలపతి అనే వ్యక్తులు భాజపా కార్యాలయంలో సహాయకులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన సొమ్ము భాజపా అధికారిక ఖాతా నుంచి తీస్తున్నట్లు తెలిపారు. వారిని నారాయణ గూడ పోలీసులకు అప్పగించారు.

గోప్యత పాటిస్తున్న పోలీసులు

ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు చేపట్టి నగదు పట్టుకుంటున్నప్పటికీ ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటం ఇదే తొలిసారి. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు.

ఇదీ చదవండి :ప్రచారానికి పచ్చనోట్లు.. రోజుకు రెండొందలు

ABOUT THE AUTHOR

...view details