తెలుగుదేశం పార్టీకి సాంకేతికసేవలందించే ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారని తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అదే సంస్థకు చెందిన అశోక్ అనే ఉద్యోగి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. నలుగురు ఉద్యోగులను కోర్టులో హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. నేడు, రేపు కోర్టుకు సెలవులున్నందున ఇంట్లోనే విచారణ జరపాలని విన్నవించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో రేగొండ భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్ఉన్నారు.
ఐటీగ్రిడ్స్ ఉద్యోగులు ఎక్కడ? - ap politics
తెదేపాకు సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు సైబరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించి...నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది.
తెలంగాణ హైకోర్టు
అర్ధరాత్రిఅసలేం జరిగింది..? ఇక్కడ క్లిక్ చేయండిఐటీ గ్రిడ్స్ సాఫ్ట్వేర్ సంస్థపై మాదాపూర్ పోలీసుల దాడి