250 రైళ్లకు గుజ్జర్ల బ్రేకులు - రైలు పట్టాలు
రిజర్వేషన్ల కోసం రాజస్థాన్లో రైలు పట్టాలపై గుజ్జర్లు చేపడుతోన్న నిరసనలు మూడో రోజుకు చేరాయి. దీనితో దేశవ్యాప్తంగా 250కి పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గుజ్జర్ల నిరసనలు
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 5 శాతం కోటా కోరుతూ గుజ్జర్లతో పాటు మరో నాలుగు సామాజిక వర్గాల వారు గత మూడు రోజుల నుంచి రైలు మార్గాలపై బైఠాయించారు.
ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు ఉత్తర రైల్వే పరిధిలో 73 రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్లు అధికారులు తెలిపారు
Last Updated : Feb 11, 2019, 7:56 AM IST