ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా -వైకాపా గొడవ.. లాఠీచార్జీ - godava

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించడానికి అక్కడికి వచ్చిన వైకాపా, తెదేపా నేతలు గొడవపడ్డారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించిన కారణంగా... పోలీసులు లాఠీచార్జి చేశారు.

godava

By

Published : Apr 5, 2019, 2:16 PM IST

పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా-వైకాపా గొడవ: లాఠీచార్జీ

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పుట్టపర్తి పరిధిలో మొత్తం 850మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందిరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటు నిమిత్తం ఎంపీడీఓ కార్యాలయంలో ఒక్క పోలింగ్ బూత్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం ఉద్యోగులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. పుట్టపర్తి తెదేపా అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి, వైకాపా అభ్యర్థి శ్రీధర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఉద్యోగులను తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రం ఒకటే ఉండటంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అసలే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటు వేసేందుకు ఎంత సేపు నిరీక్షించాలని నిలదీశారు. అధికారులు ఓటర్లకు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. డీఎస్పీ పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడికి వచ్చారు. పోలీసులు వైకాపా నేతలకు కొమ్ము కాస్తున్నారంటూ తెదేపా నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించిన కారణంగా.. పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెదేపా, వైకాపా అభ్యర్థులు పోలింగ్ కేంద్రం వద్ద ఉండటంతోనే ఈ పరిస్థితి చోటు చేసుకున్నట్లు సమాచారం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details