రాష్ట్ర ప్రయోజనాలకోసమే బాబు పోరాటం: గల్లా - galla pc
కేసులతో బెదిరించి జగన్‌ను లొంగదీసుకోవచ్చనే ఆలోచనతోనే కేసీఆర్, మోదీ..... వైకాపాతో చేతులు కలిపారని గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆరోపించారు.
GALLA
చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాలు లేవని... అందుకే మోదీతో పాటు కేసీఆర్ తోనూ పోరాడుతున్నారని ఎంపీ గల్లా అన్నారు. రాష్ట్రంలో 150 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో తెదేపా తప్పక గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైకాపా నుంచి పోటీ చేస్తున్న మోదుగులపై గల్లా మండిపడ్డారు. తనను స్థానికుడు కాదని చెబుతున్న మోదుగుల... అతని ఆదాయపు పన్ను బెంగళూరులో కడుతున్న విషయం మరిచారా అంటూ ప్రశ్నించారు.