ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ఎన్నికల కోసమే మోదీ అలా చేశారు' - mr. prime minister

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పది రోజుల వరకు ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపలేదని ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. కశ్మీరీల​కు అండగా ఉండాలన్న సుప్రీం కోర్టు పిలుపుతో స్పందించారని అంతవరకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని పేర్కొన్నారు.

ఎంపీ గల్లా జయదేవ్​

By

Published : Mar 6, 2019, 3:23 PM IST

Updated : Mar 6, 2019, 6:13 PM IST

భాజపా లబ్ధికోసమే మోదీ మౌనం..!
పుల్వామా దాడి అనంతరం పదిరోజుల వరకు మోదీ ఎందుకు పెదవి విప్పలేదని ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రధాని స్పందించారని ఆయన గుర్తుచేశారు. గత 8 నెలల నుంచి కశ్మీర్​లో అన్ని వ్యవస్థలు కేంద్రం పరిధిలోనే ఉన్నా... నిఘా సంస్థ ఎలా విఫలమైందని నిలదీశారు. హిందూ- ముస్లిం విద్వేషాలు రెచ్చగొడితే భాజపాకు లబ్ధి చేకూరుతుందనే మోదీ మౌనం వహించారని ఆరోపించారు.
Last Updated : Mar 6, 2019, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details