ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

గ్రామీణ బ్యాంకు పరీక్షలకు ఉచిత శిక్షణ - ibps rrb exam

గ్రామీణ బ్యాంకు పరీక్షలకు గుంటూరులో స్థానిక చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వారు అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ జనరల్​ మేనేజర్​ ఫణికుమార్​ తెలిపారు.

గ్రామీణ బ్యాంకు పరీక్షలకు ఉచిత శిక్షణ

By

Published : Jun 28, 2019, 7:07 AM IST

ఆంద్రప్రదేశ్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో అధికారుల, ఉద్యోగుల వార్షిక నియామక ప్రక్రియను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( ఐబీపీఎస్ ) ప్రారంభించింది. ఈ పరీక్షలు ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో జులై 21 నుంచి జులై 26 వరకు ఆఫీసర్స్ స్కేల్ 1 అభ్యర్థులకు, అలాగే జులై 27 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు ఆఫీస్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ వెల్లడించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పీఎహెచ్​డీ అభ్యర్థులు జులై 4వ తేదీ లోపల ఆన్​లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలియచేశారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రామీణ బ్యాంకు పరీక్షలకు ఉచిత శిక్షణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details