ఈసారి టవరెక్కింది రైతులు - ap latest news
మొన్న విద్యుత్ ఒప్పంద ఉద్యోగులు ..నిన్న ప్రియుడికోసం ప్రేయసి సెల్ టవరెక్కితే.. నేడు కృష్ణాజిల్లా రైతులు ఏకంకా పవర్‌గ్రిడ్ టవరెక్కారు..! మరి వీరి సమస్య పరిష్కారమయ్యేనా..?
ఈసారి టవరెక్కింది రైతులు
2013 భూసేకరణ చట్టం ప్రకారం వారి పొలాలు ప్రభుత్వానికిచ్చేశారు. విద్యుత్ అధికారులు పచ్చని పంటల్లో పవర్‌గ్రిడ్ టవర్లేశారు. నష్టపరిహారం అడిగితే పట్టించుకునే వారే కరవయ్యారు...ఇదీ కృష్ణాజిల్లా నందిగామ రైతుల పరిస్థితి. తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తూ..అన్నదాతలు పవర్‌గ్రిడ్ టవరెక్కి నిరసన తెలుపుతున్నారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేదాకా ఆందోళన విరమించేది లేదని భీష్మించుకున్నారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.