ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పత్తి మిల్లులో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం - సగానికి పైగా దగ్ధమైన కాటన్​ బైళ్లు

గుంటూరులోని హిందుస్థాన్​ టీఎంసీ పత్తి మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోట్ల రూపాయలు విలువచేసే కాటన్​ బైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 4 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్​ సర్య్కూట్​ వలన ప్రమాదం సంభవించి ఉండొచ్చని సమాచారం.

పత్తి మిల్లులో అగ్నిప్రమాదం

By

Published : Apr 27, 2019, 12:22 AM IST

హిందుస్థాన్​ టీఎంసీ కాటన్​ మిల్లులో అగ్నిప్రమాదం
గుంటూరులోని బుడంపాడులో గల హిందుస్థాన్​ టీఎంసీ కాటన్​ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. 4 గంటలపాటు చెలరేగిన మంటల్లో కోట్ల రూపాయలు విలువచేసే పత్తి దగ్ధమైంది. అగ్నిమాపక బృందం 3 ఫైర్​ ఇంజిన్ల సహాయంతో అగ్నికీలలను అదుపులోకి తీసుకొచ్చారు. సగానికి పైగా కాటన్​ బైళ్లు తగలబడ్డాయని యజమాని దేవరశెట్టి చిన్నికృష్ణ తెలిపారు. షార్ట్​ సర్క్యూట్​ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని సిబ్బంది తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details